- భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు.
- రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్.
- ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు.
- పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్.
- కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా.
- తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా.
- సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
- ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి.
- ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతున్న ప్రభుత్వం.
- 863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
- యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా Mukheem నిర్మించిన గెస్ట్ హౌస్ ను తొలగించిన హైడ్రా.
- అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా Mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా.
























