[t4b-ticker]

రీల్స్ చూసి ‘ఇరుముడి’లో అవకాశమిచ్చారు: బేబీ నక్షత్ర

ప్రతిపక్షం, ఆగస్టు 21: రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంలో నటిస్తున్న బేబీ నక్షత్ర తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్న వయసులోనే పలు భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె.. సామాజిక మాధ్యమాల్లో తాను చేసిన రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు.

ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నానని చెప్పిన బేబీ నక్షత్ర.. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఇప్పటివరకు ఆరు సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. సినిమాలతో పాటు చదువును కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

తాను సామాజిక మాధ్యమాల్లో చేసిన రీల్స్‌ను దర్శకుడు శివ నిర్వాణ చూసి ‘ఇరుముడి’ సినిమాలో అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్ర పేరు మణికంఠ అని వెల్లడించారు. సినిమాలో రవితేజ, ప్రియా భవానీ తనకు తల్లిదండ్రుల పాత్రల్లో నటిస్తున్నారని, ఇద్దరూ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని పేర్కొన్నారు.

తెలుగు భాష తనకు అర్థమవుతుందని, ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను కూడా తానే చెప్పానని బేబీ నక్షత్ర తెలిపారు. చిన్న వయసులోనే వివిధ భాషల్లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ‘ఇరుముడి’ చిత్రం తన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

Spread the love

Related News

Latest News