[t4b-ticker]

ఆలేరులో ఏసీబీ దాడులు కలకలం

తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.

ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ పాలనా అధికారి.

రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ RI, GPO.

ఆలేరులో లంచగొండులకు ఏసీబీ షాక్ – భూ రిజిస్ట్రేషన్ కోసం రూ.14 వేలు డిమాండ్.

ప్రతి పక్షం ఆలేరు, ఆగస్టు 24: యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.14,000 లంచం తీసుకుంటూ రివిన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ పాలనా అధికారి (GPO) ఇద్దరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

పట్టుబడ్డ అధికారుల వివరాలు
ఏసీబీ ప్రెస్ నోట్ ప్రకారం..
AO-1: శ్రీ వేముగంటి పూర్ణచందర్ రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఆలేరు మండలంAO-2: శ్రీ షేక్ అహ్మద్, గ్రామ పాలనా అధికారి (GPO), కొలనుపాక గ్రామం, ఆలేరు మండలం.

లంచం ఎందుకు అడిగారంటే…
ఫిర్యాదుదారుని సోదరి విక్రయించిన భూమి రిజిస్ట్రేషన్ కు సహకరించేందుకు తహసీల్దార్ కు రిపోర్టు ఇచ్చేందుకు గాను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ రావు ఫిర్యాదుదారుని వద్ద రూ.14,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ లంచాన్ని GPO షేక్ అహ్మద్ ద్వారా తీసుకుంటూ నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
*రూ.14,000 నగదు స్వాధీనం
లంచం డబ్బు రూ.14,000 ను AO-2 అయిన GPO షేక్ అహ్మద్ వద్ద నుండి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, అక్రమ లాభం పొందేందుకు ఈ విధంగా వ్యవహరించారని ఏసీబీ తెలిపింది.
*ఇద్దరికీ రిమాండ్, విచారణ కొనసాగుతోంది
పట్టుబడిన ఇద్దరు అధికారులను నాంపల్లిలోని గౌరవ AI అదనపు స్పెషల్ జడ్జి ఫర్ SPE & ACB కేసుల న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలను వెల్లడించడం లేదని పేర్కొంది.
ఈ దాడులతో ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
లంచం అడిగితే 1064 కు ఫోన్ చేయండి – ఏసీబీ పిలుపు
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్ బుక్ (Telangana ACB), X / ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ QR కోడ్ ను కూడా ఏర్పాటు చేశామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ PRO తెలిపారు.

Spread the love

Related News

Latest News