ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : నిర్మల్ జిల్లాలోని 13 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో మొత్తం1,214 మంది హాజరు కావలసి ఉండగా.. 1.116 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 98 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజూరయ్యారని నిర్మల్ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాదవ్ పరశురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని చాణక్య, వశిష్ట ప్రభుత్వ బాలుర ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సముదాయాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనఖీ చేసినట్లు తెలిపారు. 13 కేంద్రాలలో కూడా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారని ముందస్తుగా 144 సెక్షన్ అమలు లోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు.