సర్పంచ్ చింతల మల్లేష్
ప్రతిపక్షం ప్రతినిధి, ఖానాపూర్ నవంబర్ 26: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అర్హులైన కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ చింతల మల్లేష్ సూచించారు.ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒరగంటి రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్, కారోబార్ పోశెట్టి వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




























