ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన పోస్ట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ప్రధాని, ముఖ్యమంత్రులు, టాటా, బాటా, ఏపీజే అబ్దుల్ కలాం, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్ వంటి పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించిన ఆర్జీవీ.. చివరగా బాబా రామ్‌దేవ్ పేరును కూడా జాబితాలో చేర్చారు. వీరిలో పలువురు అవివాహితులు లేదా ఒంటరిగా ఉన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక మహిళ లేదా భార్య ఉండదు’ అనే వ్యాఖ్యను క్యాప్షన్‌గా పెట్టారు.
ఆర్జీవీ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆయన పేర్కొన్న జాబితాలో తమ పేరెక్కడ? అంటూ కొందరు నెటిజన్లు సరదాగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్జీవీని ఉద్దేశించి.. ‘మరి మీరు విజయవంతమైన పురుషుల జాబితాలో ఉన్నారా?’ అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
సాధారణంగా వివాదాస్పద, ఆసక్తికర వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో చర్చకు తెరలేపే రామ్‌గోపాల్ వర్మ.. ఈసారి కూడా తనదైన శైలిలో చేసిన ఈ పోస్ట్‌తో నెటిజన్లకు చర్చకు మంచి అంశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌పై భిన్నమైన స్పందనలు, సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.





























