వార్డు మెంబర్ల ఫోరం మండల అధ్యక్షుడు బత్తెం నవీన్
ప్రతిపక్షం కోదాడ నవంబర్ 27: గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల హక్కులు, సంక్షేమం, గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ పట్టణంలోని వాసవి భవన్లో నిర్వహించనున్న వార్డు మెంబర్ల ఆవేదన – గుర్తింపు నియోజకవర్గ స్థాయి సభను విజయవంతం చేయాలని ఫోరం మోతే మండల అధ్యక్షులు నవీన్ పిలుపునిచ్చారు.ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు మెంబర్లకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు మెంబర్లందరికీ నెలకు కనీస గౌరవ వేతనం మంజూరు చేయాలని, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే గ్రామాలలో నిర్మించే ప్రభుత్వ అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సర్పంచ్‌తో పాటు సంబంధిత వార్డు మెంబర్ల పేర్లను కూడా ముద్రించి సముచిత గుర్తింపు కల్పించాలని మా పోరాటం రాజకీయ పార్టీలపై కాదని వార్డు మెంబర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైనేనని వారి హక్కుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సభలో చర్చించునున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్, సూర్యాపేట జిల్లా ఇన్చార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నజీర్ పాషా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.అదేవిధంగాఈ సభకు కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.




























