ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 27: కేరళ లోని కాలికట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 25, 2026, నుండి నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (2026- 27) కు రామకృష్ణ డిగ్రీ, పీ.జీ, కళాశాలలో బి. బి. ఏ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ ముస్తాకిం శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జట్టు తరఫున ఆడడానికి వరుసగా రెండవ సంవత్సరం కూడా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా ముస్తకిం ను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ , డైరెక్టర్ హరిప్రియ అంజయ్య గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ దయాత్రి శ్రీనివాస్ , ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.





























