ప్రతిపక్షం ప్రతినిధి కుమురం భీమ్ ఆసిఫాబాద్, నవంబర్27: రాంజీగూడ గ్రామస్తులకు ధనోరా గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.శుక్రవారం జిల్లాలోని కెరమెరి మండలం ధనోరా గ్రామ శివారులో ఏర్పాటుచేసిన పునరావాస ప్రదేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమరం భీమ్ ప్రాజెక్టు నిర్మాణంలో బ్యాక్ వాటర్ ముంపు గ్రామమైన రాంజీగూడా గ్రామస్తులకు ధనోరా గ్రామం వద్ద పునరావాసం కల్పించడం జరిగిందని, గ్రామస్తులను పునరావాస కాలనీకి తరలించేందుకు కాలనీలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెట్ల పొదలు చదును చేసి ప్లాట్లు చేయాలని, సి.సి. రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్ లైన్, మిషన్ భగీరథ త్రాగునీరు అందించేందుకు ట్యాంకు నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. పనులను చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు



























