-మహిళలు,యువతుల పట్ల వేధింపులకు పాల్ప డితే చట్టపరమైన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్,
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్, 27: ప్రేమ, పెళ్లి పేరుతో యువతి ని బెదిరిస్తూ, భయభ్రాంతు లకు గురిచేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.700, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింద గని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కొడిమ్యాల, పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక యువతిని రాజన్న సిరిసిల్ల, జిల్లా, ముద్దపల్లి, గ్రామానికి చెందిన ఇల్లంతకుంట వినీల్ తేజ, అనే యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, బెదిరింపు లకు పాల్పడుతూ యువ తిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో విచారణ అనంతరం జగిత్యాలలోని గౌరవనీయ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి శ్రీమతి సునీత రవీంద్ర రెడ్డి, నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.700, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించా రు. ఈ సందర్భంగా ఎస్పీ, మాట్లాడుతూ మహిళలు, బాలికలు మరియు యువ తుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రేమ పేరుతో వేధించడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెదిరించడం, వెంటపడటం, ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా అసభ్యక రంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసు లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల వివరాలు, గోప్యతకు పోలీస్ శాఖ తగిన ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసు కుంటామని పేర్కొన్నారు.



























