యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలు!

నిర్మల్‌లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకులు..

నాయకుడి జన్మదిన వేడుకలు.. యువజన కాంగ్రెస్‌లో నూతనోత్సాహం!”

ప్రతిపక్షం, నవంబర్ 28, నిర్మల్: ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సమర సింహ రెడ్డి, ముధోల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగింది.ఈ వేడుకల్లో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నొమన్, నిఖిల్, జనరల్ సెక్రటరీ అజమాట్ ఖాన్, నిర్మల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్షద్,సాయిప్రతాప్,నరేష్, స్వామి తదితర యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నారాయణరావు పటేల్ ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలతో నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.

Related News

Latest News