ప్రసవ సేవలకు ప్రశంసాపత్రం

ప్రతిపక్షం కోదాడ నవంబర్ 28: ప్రసవ సేవల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి డాక్టర్ భవానీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. పీహెచ్‌సీలో గర్భిణులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, సాధారణ మరియు సురక్షిత ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ఆమె చేస్తున్న విశేష కృషికి గాను అధికారులు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, స్థానికులు డాక్టర్ భవానీని అభినందించారు.

Related News

Latest News