గ్రామ గ్రామాన మహిళ సమైఖ్య భవనాల నిర్మాణం.. భైంసా మండలం 2కోట్ల 80 లక్షల నిధుల తో 28 భవనాలు నిర్మించి ప్రారంభించాం

*వలేగాం గ్రామం లో ఐకేపీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రతిపక్షం ప్రతినిధి ముధోల్ నవంబర్ 28: మహిళ సాధికారత కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయని అందులో భాగంగా ముధోల్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామం లో 20 లక్షల రూపాయల నిధులతో రెండు సమైక్య భవనాలు నిర్మిస్తున్నామని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* అన్నారు.శనివారం భైంసా మండలం లోని వలెగాం గ్రామం లో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళ సమైక్య భవనాలను ప్రారంభించిన సందర్భంగా అయన మాట్లాడారు.. ఐకేపీ భవనాల నిర్మాణం లో రాష్ట్రము లోనే ముధోల్ నియోజకవర్గం ముందు ఉందని, అందులో భైంసా మండలం లో ఎక్కువ భవన నిర్మాణలు పూర్తి కావడం జరిగిందన్నారు. ఇందుకు సహకరిస్తున్న అధికారులు, సర్పంచ్ లను అయన అభినందించారు.. అదే విధంగా వి బి జి రాంజీ పథకం లో నియోజకవర్గంలో గ్రామ గ్రామాన రోడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో నిధులు ఇస్తానని, జూన్ వరకు గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండి పొలాలకు వెళ్లే రోడ్లు నిర్మించుకోవాల్సిందిగా సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు వలెగాం గ్రామానికి ఇప్పటివరకు కోటి రూపాయల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని, అందులో కొన్ని పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తి చేయాల్సిందిగా చెప్పారు.

మహిళలు కలిసికట్టుగా ఉండి స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పారు. ముఖ్యంగా తమ పిల్లలకు చిన్ననాటి నుండి సంస్కార భావాలు అలవర్చుకునేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశోక్, నాయకులు దిగంబర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి వలెగాం గ్రామం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తాము ఎప్పటికి రుణపడి ఉంటామన్నారు. గ్రామంలో ఇప్పటివరకు 72 మందికి సీఎంఆర్ ఎఫ్ చెక్కులు, ఎల్ వో సీ లు ఇచ్చారని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా సహకరిస్తున్నారన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు మహిళలు ఘన స్వాగతం పలికారు..కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపిడి విఠల్, ఐకెపిఎపిఎమ్ రమేష్, మాజీ ఎంపీపీ రజాక్, సర్పంచులు సిరం సుష్మ రెడ్డి, శ్యామ్ రావు పటేల్, అశోక్ సుధాకర్, వినోద్, మహేందర్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్,ఆఖిల్, ఉపాధి హామీ ఏపీవో, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News