*జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీపీఆర్వో విష్ణువర్ధన్ కు ఆహ్వాన పత్రికలు అందజేసిన జర్నలిస్టు సంఘం నాయకులు
ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న నిర్వహించనున్న జిల్లా మూడో మహాసభలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మహాసభల ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) విష్ణువర్ధన్ ను కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మహాసభలను నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు వివరించారు. మహాసభలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వేణుగోపాల్, అశోక్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, సభ్యుడు బోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



























