- గోదావరి నదిలో ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం
ప్రతిపక్షం, వెంకటాపురం, వాజేడు, నవంబర్ 28: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. వెంకటాపురం మండల కేంద్రంలోని మారికాల గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీనగరం గ్రామానికి చెందిన ఉయిక గోవిందరావు (29) శనివారం ఉదయం సుమారు 7:09 గంటలకు చేపల వేట కోసం గోదావరి నదికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయి మృతి చెందినట్లు సమాచారం.మృతుడు గోవిందరావు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. చిన్న వయసులోనే అతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



























