నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం రైతులతో కలిసి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా

చండీ సబ్‌స్టేషన్‌ ఎదుట సంగారెడ్డి–తూప్రాన్‌ ప్రధాన రహదారిపై బైఠాయింపు

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 12: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. వరి ధాన్యంతో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో విఫలమైందని విమర్శించారు.

విద్యుత్‌ సరఫరాలో సమస్యల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండటంతో వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యల రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News