దసరా, బతుకమ్మ పండుగల వేళ అప్రమత్తంగా ఉండండి

వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి

ప్రతిపక్షం,రామగుండం, అక్టోబర్ 12: దసరా,బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి సూచించారు.ఊర్లకు వెళ్లేటప్పుడు ఇళ్లకు సరైన తాళాలు వేయాలని,విలువైన వస్తువులు బహిరంగంగా ఉంచవద్దని,తాళం వేసిన విషయాన్ని పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని, తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.సెలవుల్లో పిల్లలు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు,వివరాలు పెట్టకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని,తెలియని లింకులు,ఓటీపీ లు షేర్ చేయవద్దని సూచించారు.
బస్సులు,రైళ్లలో ప్రయాణించేటప్పుడు జేబు దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Spread the love

Related News

Latest News