చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణం

సీసీ కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల ద్వారా నిర్ధారణ

మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ వెల్లడి

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 13: మెదక్ పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని విచారణలో వెల్లడైనట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో కోతులు విగ్రహాన్ని పట్టుకొని ఊగడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.విగ్రహం దెబ్బతిన్న విషయం తెలియగానే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు, ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు మహిళల నుంచి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం విగ్రహం దెబ్బతినడానికి కోతులే కారణమని నిర్ధారణకు వచ్చినట్లు ఇన్‌స్పెక్టర్ మహేష్ వెల్లడించారు.

Spread the love

Related News

Latest News