ట్రాన్స్‌ఫార్మర్‌పై పని చేస్తుండగా విద్యుత్ షాక్‌.. రైతు మృతి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ.. లైన్‌మెన్‌పై దాడి

ప్రతిపక్షం మెదక్ ప్రతినిధి అక్టోబర్ 14: మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం దండువానికుంట తండాలో ట్రాన్స్‌ఫార్మర్‌పై పని చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు విస్లావత్ అనిల్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ట్రాన్స్‌ఫార్మర్‌పై అనిల్ పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో లైన్‌మెన్ కిందనే ఉన్నట్లు తెలిసింది. విద్యుత్ సరఫరా నిలిపివేత, భద్రతా చర్యల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అనిల్ మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు లైన్‌మెన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News