అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని యువతి మృతి

నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన..

తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చిన్న కోడూరు పోలీసులు..

ప్రతిపక్షం సిద్దిపేట రూరల్, అక్టోబర్ 14: అనుమానాస్పద స్థితిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన సూరస్ శ్రావణి (19) సిద్దిపేట పట్టణంలోని శ్రీ మంజునాథ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంది. రోజూలాగే డ్యూటీ కి వెళ్ళిన శ్రావణి మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకొని బుధవారం ఉదయం చేతికి ఇంజక్షన్ తో ఇంటికి చేరుకుంది. తల్లి రజిత ఏమైందని అడగగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పి పడుకున్న శ్రావణి, తల్లి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Spread the love

Related News

Latest News