CM Revanth Reddy serious On BRS: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని, కొంతమంది రాజకీయ కక్ష్యతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా వివిధ రకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగంపై సమీక్షించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. కాగా, కొంతమంది బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ఆస్పత్రికి వెళ్తానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన హరీశ్ రావును కూడా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత మేమే దగ్గరుండి తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు.