Trending Now

Vandebharat: వందేభారత్ రైలుపై దాడికి పాల్పడిన ఐదుగురి అరెస్ట్

Five arrested for vandebharat train attack: ఇటీవల కాలంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లపై దుండగుల దాడులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్ రైలుపై తాజాగా కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాళ్ల దాడి వల్ల మూడు బోగీల అద్దాలు దెబ్బతిన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులది బాగ్బహారా ప్రాంతమని తెలిపారు. ట్రయల్ రన్ జరుగుతుండగా కొందరు ఆకతాయిలు రాళ్లు విసరడంతో రైలు అద్దాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌‌లోని బగ్బాహారా రైల్వేస్టేషన్ పరిధిలో దుర్గ్‌-విశాఖపట్నానికి రాకపోకలు సాగించనుంది.

Spread the love

Related News

Latest News