Trending Now

Sardar Ravinder Singh: ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌కు సంపూర్ణ మద్దతు

  • ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకై ప్రశ్నిస్తారు
  • నాలుగు వేల సంస్కృత ఉపన్యాసకుల సంపూర్ణ మద్దతు
  • సంస్కృత ఉపన్యాసకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట: ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌కు సంస్కృత ఉపన్యాసక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మృత్యుంజయ శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కరీంనగర్ మాజీ మేయర్, విద్యావేత్త సర్దార్ రవీందర్ సింగ్ రాష్ట్రంలో రూపాయి మేయర్‌గా ప్రసిద్ధి చెందారన్నారు. సంస్కృత భాషకు ఇంటర్‌లో ఉపద్రవం వచ్చిన సందర్భంలో కరీంనగర్‌లో సంస్కృత శంఖారావం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆనాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించారన్నారు. రవీందర్ సింగ్ నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేశారన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సంస్కృత ఉపన్యాసక సంఘం నాలుగు వేల ఉపన్యాసకులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సంపత్, గౌరవ సలహాదారులు సురేష్, తిరుపతి, గణేష్, సుశీల్, రాజేష్, నాగరాజు, సిరిసిల్ల కౌన్సిలర్ భాస్కర్, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News