ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి రెండు సిలిండర్లు పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో లఖ్నవూ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్ని మాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.