ప్రతిపక్షం, ఆగస్టు 29: హైదరాబాద్, సికింద్రాబాద్ (గ్రేటర్) వ్యాప్తంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల (ఇన్‌ఫ్లుయెంజా) లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీలలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ముందస్తు అప్రమత్తత అవసరము..
అయితే, ప్రస్తుతానికి తెలంగాణలో అధికారికంగా తీవ్రమైన స్వైన్ ఫ్లూ కేసుల నమోదు కాలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేసినప్పటికీ, ప్రైవేట్ ల్యాబ్‌లు మరియు ఆసుపత్రులలో సాధారణ ఫ్లూ లక్షణాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ రెండు మూడు రోజుల క్రితం ఒక ప్రకటన చేస్తూ హెచ్1ఎన్1కు సంబంధించి ఎలాంటి కొత్త వేరియంట్‌ను గుర్తించ లేదని పేర్కొంది. హెచ్1ఎన్1 సహా కాలానుగుణ ఇన్‌ఫ్లుయెంజా జ్వరం ఎక్కువగా స్వీయ పరిమితం కలిగి ఉంటుంది . జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులు ఈ వ్యాధి సాధారణ లక్షణాలుగా ఉన్నాయి…అయితే ఈ లక్షణాలు చిన్న పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఉంటున్నాయి..
💥 ఇప్పుడు ఉన్న వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలం :
- వానలు కురుస్తుండటంతో అంతటా తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. దీంతో ఇన్‌ఫ్లూయెంజా, హెచ్1ఎన్1 వంటి వైరస్లు వ్యాప్తి చెందటానికి అనువుగా ఉంటుంది. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సులభంగా చేరుతాయి. అలాగే వైరస్ ఉన్న ఉపరితలాలను ముట్టుకుని మళ్లీ ఆ చేతులను తెలియకుండానే ముక్కు, నోరు, కళ్ల వద్ద పెట్టుకుంటుంటారు. దీంతో ఈ వైరస్లు ఇతరులకు సైతం సోకుతుంది..
💥 ఏమిటీ స్వైన్ ఫ్లూ? ఎలా వ్యాపిస్తుంది..
స్వైన్ ఫ్లూ అనేది ఇన్‌ఫ్లుయెంజా-A వైరస్ వల్ల శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే తీవ్రమైన ఇన్ఫెక్షన్.
వైరస్లు ఎక్కువగా గాలి, వెలుతురు ఎక్కువగా లేని గదుల్లో ఎక్కువ సేపు ఉండి, అక్కడే వృద్ధి చెందుతాయి. అందుకే అన్ని గదుల్లోకి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి . చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వారిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది..
💥 లక్షణాలు:
తీవ్రమైన జ్వరం, దగ్గు, గొంతు నొప్పి,ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ,
ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, నీరసం
జాగ్రత్తలు:
- ఇది సాధారణ, సీజనల్, వార్షిక ఫ్లూ మాత్రమే..
- చేతుల పరిశుభ్రత: సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి.
- మాస్క్ – దూరం: దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
- ఎప్పటికప్పుడు నీళ్లు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవటంతో పాటు మి వైద్యుల సలహాతో పారాసిటమాల్ వాడటంతో 3-4 రోజుల్లోనే కోలుకోవచ్చు.
💥 వ్యాక్సినేషన్ : మి వ్యక్తి గత వైద్యుల సలహాతో వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చు..
💥 ఐసోలేషన్: లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం .
💥 మీరు వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
- ఒకవేళ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లయితే వైద్యుల సూచనలతో యాంటీ వైరల్ మందులు వాడాలి. వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా యాంటీబయోటిక్స్, సిరప్‌లు వాడకూడదు.
💥 👇🏽కింది ఇచ్చిన తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి:
- శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి
- నిరంతర తలతిరగడం, తీవ్రమైన డీహైడ్రేషన్
- గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు ఉన్న దీర్ఘకాలిక రోగుల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే మి వ్యక్తిగత వైద్యుని సలహా తీసుకోవాలి.






























