[t4b-ticker]

బాలికపై ఆటోలో లైంగికదాడి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: హైదరాబాద్‌లో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన బాలిక బార్కస్‌లోని ఓ ఇంట్లో పని చేస్తోంది. రోజువారీగా ఇంటి నుంచి పనికి వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తుండేది.

ఈ క్రమంలో ఇటీవల ఆటోలో ఉన్న అహ్మద్, అస్లాం అనే ఇద్దరు డ్రైవర్లు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఘటనతో భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News