[t4b-ticker]

పళ్ళు (దంతాలు) సరిగ్గా తోమకపోతే.. గుండె జబ్బు రావచ్చా?

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: మీ దంతాలను తోముకోవడం, ఫ్లాసింగ్ చేసుకోవడం మీ దంత ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం.తీవ్ర చిగుళ్ల జబ్బుకు కారణమయ్యే పార్ఫీరోమోనాస్ జింజివలిస్ అనే బ్యాక్టీరియా గుండె కవాటాన్నీ దెబ్బతీస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఇది గుండె ఎడమ జఠరిక, బృహద్ధమని మధ్య కవాటం (అయోర్టిక్ వాల్వ్) బిగుసుకోవటానికీ, కుంచించుకోవటానికీ దారితీస్తున్నట్టు తేలింది… ముఖ్యంగా రాత్రిపూట దంత పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల మీ చిరునవ్వుకు హాని కంటే ఎక్కువే జరుగుతుంది. ఒక కొత్త అధ్యయనంలో దంత పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల మీ నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుందని, అది తరువాత రక్తప్రవాహంలోకి జారి గుండెలోకి చొచ్చుకుపోతుందని తేలింది.ఈ చిగుళ్ల సమస్యలకు గుండె జబ్బులకూ మధ్య సంబంధాన్ని తెలుసుకోవటానికిది తోడ్పడగలదని తెలుస్తుంది..

దంత పరిశుభ్రత లేకుంటే – చిగుళ్ల వ్యాధి

కొన్ని నెలల క్రితం హిరోషిమా విశ్వవిద్యాలయం సర్క్యులేషన్లో నుంచి ప్రచురించిన ఒక సంచలనాత్మక అధ్యయనం చిగుళ్ల వ్యాధితో ముడిపడి ఉన్న పార్ఫీరోమోనాస్ జింజివలిస్ బాక్టీరియం (Porphyromonas gingivalis) అనేది మానవ నోటి కుహరంలో (Oral cavity) ఉండే ఒక ప్రమాదకరమైన గ్రామ్-నెగటివ్ (Gram-negative), వాయురహిత (Anaerobic) బ్యాక్టీరియా. ఇది చిగుళ్ల వ్యాధులకు, ముఖ్యంగా తీవ్రమైన పీరియాంటైటిస్ (Periodontitis) లేదా చిగుళ్ల వాపుకు ప్రధాన కారణం. ఆకస్మిక గుండెపోటు, స్ట్రోక్లతో ముడిపడి ఉన్న గుండె లయ రుగ్మత అయిన కర్ణిక ఫైబ్రిలేషన్ (AFib) ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది .ఈ బాక్టీరియం రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండెలోకి చొరపడుతుందని, ఇది ఫైబ్రోసిస్ అని పిలిచే మచ్చ కణజాల నిర్మాణానికి దారితీస్తుందని, ఇది గుండె నిర్మాణాన్ని వక్రీకరిస్తుందని, విద్యుత్ సంకేతాలకు అంతరాయం కలిగిస్తుందని, కర్ణిక ఫైబ్రిలేషన్ (AFib) ప్రమాదాన్ని పెంచుతుందని వారు చేసిన అధ్యయనం వల్ల..ఇంకా ఈ చిగుళ్ల జబ్బులో ప్రధానంగా పాలు పంచుకునే పార్ఫీరోమోనాస్ జింజివలిస్ గుండె కవాటంలో క్యాల్షియం పోగుపడేలా చేస్తున్నట్టూ కాల్సిఫిక్ అయోర్టిక్ వాల్వ్ డిసీజ్ ((CAVD – Calcific Aortic Valve Disease)) తాజాగా తేలింది.

కవాట మార్పిడి సందర్భంగా సంగ్రహించిన అయోర్టిక్ వాల్స్లో ఈ బ్యాక్టీరియా డీఎన్ఏ, దీనికి సంబంధించి ప్రొటీన్లు పెద్దమొత్తంలో ఉంటున్నట్టు కనుగొన్నారు. మామూలు గుండె కవాటంతో పోలిస్తే క్యాల్షియంతో గట్టిపడిన కవాటంలో పి. జింజివలిస్ బ్యాక్టీరియా ఆనవాళ్లు 30 రెట్లు ఎక్కువగా కనిపించటం గమనార్హం. ఇది నేరుగా కవాటాన్ని దెబ్బతీస్తుందా? లేదా? అనేదీ వైద్య శాస్త్ర పరిశోధన ద్వారా ఆరోగ్యంగా ఉన్న కొన్ని ఎలుకల రక్తంలోకి ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి పరిశీలించగా.. ఇది గుండె కవాటానికి చేరుకొని, అక్కడ వాపు ప్రక్రియను ప్రేరేపిస్తున్నట్టు తేలింది. అలాగే క్యాల్షియం పోగుపడేలా, కవాటం కుంచించుకుపోయేలా చేస్తున్నట్టూ బయటపడింది. కొలెస్ట్రాల్ ఎక్కువగా లేకపోయినా కవాటంలో క్యాల్షియం పోగుపడటం ఆశ్చర్యకరమని పరిశోధనల వల్ల తెలుస్తుంది.సంప్రదాయ గుండెజబ్బు ముప్పు కారకాలతో నిమిత్తం లేకుండా పి. జింజివలిస్ బ్యాక్టీరియా నేరుగా కవాట సమస్యకు దారితీస్తున్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయి .చిగుళ్ల జబ్బుకూ గుండె జబ్బులకూ నేరుగా శారీరక యంత్రాంగ సంబంధం ఉంటోందనే విషయాన్ని ఈ శాస్త్రీయ పరీక్ష మరింత బలోపేతం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సీఏవీడీతో బాధపడుతున్నారు. సాధారణంగా ఒకప్పుడు దీనిని కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యగా భావించేవారు, కానీ ఇది ఒక రకమైన క్రియాశీలక ప్రక్రియని పరిశోధనలు చెబుతున్నాయి. వయసు పైబడటం వల్ల లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గుండె కవాటాలు గట్టిపడి, రక్తం సరిగ్గా ప్రవహించకుండా అడ్డుపడతాయి కాని కవాటంలో క్యాల్షియం పోగుపడటాన్ని ఆపటానికి, నెమ్మదింపజేయటానికి ప్రస్తుతం అనుమతి పొందిన మందులేవీ లేవు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ నిస్సత్తువ, ఆయాసం, ఛాతీనొప్పి వంటివి వేధిస్తుంటాయి. సమస్య మరీ విషమిస్తే కవాట మార్పిడి చేయాల్సి వస్తుంది. తాజా అధ్యయన ఫలితాలతో దీనికి చికిత్స చేసే మార్గాన్ని చూపగలదని భావిస్తున్నాము . వాపు ప్రక్రియను ప్రేరేపించే ఇంటర్ల్యూకిన్-1 బీటాను నిలువరిస్తే బ్యాక్టీరియా కవాటానికి చేరుకున్నా కూడా క్యాల్షియం అంత ఎక్కువగా పోగుపడటం లేదనీ పరిశోధనల తెలుపు తున్నాయి .

జాగ్రత్తలు

మంచి దంత పరిశుభ్రతను కాపాడుకోవడానికి, రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోండి. మృదువైన ముళ్ళతో కూడిన టూత్ బ్రష్ మరియు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఉపయోగించండి. రెండు నిమిషాలు బ్రష్ చేయండి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు లేదా ముళ్ళు తెగిపోయినప్పుడు మీ టూత్ బ్రష్ ను మార్చండి.

రోజుకు ఒకసారి ఫ్లాసింగ్ చేయడం వల్ల బ్రష్ లో చేరుకోలేని దంతాల మధ్య ఆహార కణాల మరియు ఫలకాన్ని తొలగించవచ్చు. మీరు మౌత్ వాష్ లు కూడా వాడవచ్చు . టంగ్ స్క్రాపర్ తో మీ నాలుకను శుభ్రం చేయడం వంటి పద్ధతులు నోటి పరిశుభ్రతకు మంచివి. అలాగే, చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలను పరిమితం చేయండి. మెరుగైన దంత ఆరోగ్యం కోసం పొగాకును నివారించండి.మీ వ్యక్తి గత దంత వైద్యునితో ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెకప్ లు ,స్కేలింగ్ (దంతాల క్లీనింగ్) దంతాలను శుభ్రపరచడం చేసుకోవాలి.

Spread the love

Related News