[t4b-ticker]

గాంధీజీ పాఠశాలలో లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

*శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలరించిన విద్యార్థులు.

*పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయి.

*చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు.

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 03: స్థానిక గాంధీజీ విద్యాసంస్థలలో గురువారం నాడు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, గొల్లభామల వేషధారణలో సందడి చేసి అందరినీ ఆకట్టుకున్నారు.చిన్నారుల వేషధారణ, సంప్రదాయ ఉట్టికొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణాష్టమి విశిష్టతను, శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రదర్శించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం కృష్ణ నామస్మరణతో, చిన్నారుల కేరింతలతో మార్మోగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చండూరు మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, తెలంగాణ పండుగల విశిష్టతను, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను విద్యార్థులకు తెలియజేయడం చాలా అవసరమని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి పండుగలు, కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరు పండుగల విలువలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జాని, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఫోటో క్యాప్షన్: గాంధీజీ పాఠశాలలో శ్రీ కృష్ణుడు, రాధ వేషధారణలో అలరించిన చిన్నారులతో మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు

Spread the love

Related News

Latest News