[t4b-ticker]

చండూరులో కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళ ఫైర్ – “మాయమాటలు చెప్పి మోసం చేశారు”

2500, తులం బంగారం ఇస్తామని 25 రూపాయలు కూడా ఇవ్వలేదు.

మాయమాటలు చెప్పి మోసం చేశారు – చండూరులో మహిళా ఆవేదన.

కేసీఆర్ పాలనే బెటర్ అంటూ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్ మహిళ .

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై మహిళ ఆగ్రహం .

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వంటా-వార్పులో హాట్ టాపిక్ .

ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 04: చండూరు మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన వంటా-వార్పు కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓ మహిళ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. “మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు… 2500, తులం బంగారం ఇస్తామని చెప్పి 25 రూపాయలు కూడా ఇవ్వలేదు” అంటూ నిలదీసింది.”రాజగోపాల్ రెడ్డి మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిన ఆ మహిళ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ కండువా కప్పుకుని ప్రస్తుత పాలనపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. మాటలు కాదు, చేసిన అభివృద్ధి కావాలని డిమాండ్ చేసింది.
చండూరు మున్సిపల్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

“రాబోయేది మళ్లీ కేసీఆర్… రాక్షస పాలన పోవాలి – ప్రజల రాజ్యం రావాలి” అంటూ నినాదాలు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కార్యకర్తలు నినదించారు.ఈ కార్యక్రమంలో చండూరు మండల పట్టణ అధ్యక్షులు బొమ్మన బోయిన వెంకన్న, కొత్తపాటి సతీష్, కల్లుగీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతి, మునగాల నారాయణరావు, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, పల్లె కళ్యాణి, మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, అన్నేపర్తి సంతోషా శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ తోకల చంద్రకళ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవి వెంకటరెడ్డి, దంటు జగదీష్, మండల ఆధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, యువజన అధ్యక్షుడు ఉజ్జని అనిల్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోని వెంకన్న గౌడ్, అన్నేపర్తి శేఖర్, కౌన్సిలర్లు తేలుకుంట రాజకుమారి చంద్రశేఖర్, సామ సుజాత యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, పెండ్యాల గీత, సంఘపు సువర్ణ, చొప్పరి దశరథ, మహమ్మద్ గౌస్, ఇడికూడ నాగరాజు, నందికొండ నరసింహారెడ్డి, ఇరిగి రామన్న, చిలువేరు నరేష్, నారపాక శంకర్, అన్నిపాక ధనయ్య, స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ నాయకులు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News