ప్రతిపక్షం చండూరు, సెప్టెంబర్ 07: చండూరు మండలంలోని కోటయ్యగూడెం గ్రామంలో శ్రావణమాస బోనాల పండుగను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు.గ్రామ పంచాయతీ సర్పంచ్ గాలంక రాంబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే గ్రామంలోని మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించుకొని, డప్పు చప్పుళ్లు, ఆటపాటల నడుమ గ్రామ దేవతకు బోనాలను సమర్పించారు.గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.





























