ప్రతిపక్షం చండూరు , సెప్టెంబర్ 06: చండూరు మండలంలోని కస్తాల గ్రామంలో ముత్యాలమ్మ, కోట మైసమ్మ, పెద్దమ్మ తల్లి బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదన్న సత్యం ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగను ఘనంగా జరిపారు. ఆదివారం ఉదయం నుండి మహిళలు సంప్రదాయ బద్దంగా బోనాలను తయారు చేసుకొని, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవార్లకు సమర్పించారు.గ్రామంలోని ముత్యాలమ్మ, కోట మైసమ్మ, పెద్దమ్మ తల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మహిళలు బోనాలు సమర్పించి, తమ కుటుంబాలు, గ్రామం సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నరసింహ, వార్డు నెంబర్లు దోటి శ్రీను, కట్ట సైదులు,బొమ్మరబోయిన కవిత సైదులు, గురిజాల రమ్య స్వామి, బండి శోభ శేఖర్, మెరుగు అంజయ్య, దోణాల శ్రీనివాస్ రెడ్డి, అశోక్, పావని రమేష్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*కోటయ్య గూడెంలో శ్రావణమాస బోనాలు
ఈరోజు కోటయ్య గూడెంలో శ్రావణమాస బోనాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ గాలంక రాంబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ఆటపాటలతో మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.






























