చాకలి ఐలమ్మకు ఘనమైన గౌరవంతో నూతన విగ్రహం ఏర్పాటు

సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తా: ఎమ్మెల్యే రోహిత్ రావు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 13: మెదక్ పట్టణంలోని వెల్‌కమ్ బోర్డు సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహం దెబ్బతిన్న ఘటనలో కోతుల వల్లే నష్టం దురదృష్టకరమని మెదక్ ఎమ్మెల్యే మైనoపల్లి రోహిత్ ఉన్నారు .
ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ , వీరనారి చాకలి ఐలమ్మకు మరింత గౌరవప్రదంగా తన సొంత ఖర్చులతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మెదక్ పట్టణంలో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. విగ్రహాలు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై రాజకీయ ఆరోపణలకు తావివ్వకుండా, పోలీసుల విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా నిర్ణయాలకు రావాలని ఆయన వర్గీయులు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News