పూల పండుగలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు

ప్రతిపక్షం మెదక్ ప్రతినిధి అక్టోబర్ 15: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మెదక్ విద్యుత్ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ కార్యక్రమానికి మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యుత్ శాఖ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగనుసంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News