పెన్షనర్ల ఆరోగ్య కార్డుల సమస్యలు పరిష్కరించాలి

నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 15: ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వైద్య సేవలు పొందడం కష్టంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం (ఎస్‌జీపీఏటీ) సిద్ధిపేట జిల్లా శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్య కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఆరోగ్య కార్డులను రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షనర్లు వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా నగదు రహిత చికిత్స సౌకర్యాన్ని సమర్థంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వెల్‌నెస్‌ కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలి

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని వెల్‌నెస్‌ కేంద్రంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జోగు బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు చిల్ల నరసింహులు, ప్రధాన కార్యదర్శి బోరెడ్డి మధుసూదన్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, పరశురాములు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, నాగేందర్‌, సత్తయ్య, బన్సీలాల్‌, లక్ష్మారెడ్డి, హనుమంతరెడ్డి, రవీందర్‌, రాములు, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News