*ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ తోకల వెంకన్న.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 16 : చండూరు మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన C-మార్ట్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న హాజరై రిబ్బన్ కట్ చేసి C-మార్ట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తోకల వెంకన్న మాట్లాడుతూ, చండూరు ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా C-మార్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. చండూరు పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, ఇలాంటి వ్యాపార సంస్థలు యువతకు ఉపాధి కల్పిస్తాయని అన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పడమటితళ్ళ సర్పంచ్ గాలెంక రాంబాబు , బీఆర్ఎస్ పార్టీ నాయకులు శిరంశెట్టి శ్రీధర్ బాబు గారు, గండూరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.నాయకులు, స్థానిక ప్రజలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరై C-మార్ట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. చండూరు ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు అందించాలని కోరారు.అనంతరం C-మార్ట్ నిర్వాహకులు హాజరైన అతిథులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.





























