- రామడుగు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ సర్పంచ్ లు..?
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 17: ప్రజలను వేధించి, దోపిడి పాలన చేసిన బి ఆర్ఎస్ నాయకుల హవా కొనసాగుతుంది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో… ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు.. కాంగ్రెస్ అధికారం లోకి రావడంతోనే.. కొంతమంది సర్పంచ్ లు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులలో ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో లోని రామడుగు మండలంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్ అన్నారు.మండలంలోని పలు గ్రామాల్లో కొన్నిచోట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజకీయాలు చేస్తూ వారికి నచ్చిన వారికి ఇల్లు కేటాయిస్తున్నారు. అలాగే గ్రామాల్లో కొంతమంది సర్పంచులు బి ఆర్ఎస్ లో ఉన్నవారు, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కార్యకర్తలకు, ఓటర్లకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైనా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా లు విచారణ జరిపి నిజమైన అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు ను కేటాయించాలని కోరుచున్నాము. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్న విషయం చొప్పదండి ఎమ్మెల్యే గుర్తిస్తే మంచిదన్నారు. వారి లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కొంతమంది సర్పంచులు నేడు ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు…అలాగే కొన్ని గ్రామాల్లో కార్యదర్శిలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించకుండా, సర్పంచులు చెప్పిందే వేదామంటూ, వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే అలాంటి వారి లిస్ట్ ను తయారు చేసి రామడుగు మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు అన్ని దళిత సంఘాలు, అన్ని బిసి,సంఘాలను కలుపుకొని ధర్నా చేపడతామని హెచ్చరిస్తున్నాం. అవసరమైతే రామడుగు మండలంలో అన్ని గ్రామాల్లో పర్యటించి అర్హులు అయిన వారికి ఎందుకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదో.. అనే విషయాలను జిల్లా రాష్ట్ర మంత్రులకు, ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ పోరాటం నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగబోయే వరకు జరుగుతుందన్నారు.. అవసరమైతే కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల పోరాట కమిటీ ని ఏర్పాటు చేస్తామన్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.





























