అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి.

మీ ఓటు మీ హక్కు.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.

*చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి.

ప్రతిపక్ష చండూరు అక్టోబర్ 17 : వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం ప్రారంభమైందని చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో నివసిస్తున్న అర్హత కలిగిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

*ముఖ్యమైన అర్హతలు & మార్గదర్శకాలు:

దరఖాస్తుదారులు 2023 నవంబర్ 1 నాటికి కనీసం 3 సంవత్సరాల ముందే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ceotelangana.nic.in ద్వారా ఆన్ లైన్ లో సమర్పించవచ్చు.

నేరుగా దరఖాస్తు చేసుకునే వారు నింపిన ఫారం-18 ను తమ సంబంధిత DEO / ERO / AERO కార్యాలయాలలో నేరుగా సమర్పించవచ్చు.

నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీ 06 నవంబర్, 2026 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

*సాగర్ రెడ్డి గారి పిలుపు:

రాజకీయ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మేకల సాగర్ రెడ్డి గారు, “మీ ఓటు మీ హక్కు. మీ పేరు నమోదు చేసుకోవడం మీ బాధ్యత” అని పేర్కొన్నారు. అర్హత గల పట్టభద్రులందరూ గడువు ముగియక ముందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు.

ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు బాధ్యత తీసుకొని అర్హులైన పట్టభద్రులందరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News