ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో రూ.60 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రతిపక్షం,శామీర్ పేట, అక్టోబర్ 17: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కొల్తూరు, ముడుచింతలపల్లి, జగన్‌గూడ, కేశవరం, అద్రాస్ పల్లి,పొన్నాల గ్రామాల్లో సుమారు రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ముడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News