నిరుపేద కుటుంబానికి రూ.5 వేల సహాయం అందజేత
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 18: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన తొగరి రోజా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి, మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5 వేల ఆర్థిక సాయాన్ని నాయకుల ద్వారా అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు బానప్పగారి నర్సారెడ్డి, భాస్కర్రెడ్డి, తుడుం శ్రీనివాస్, నరసింహారెడ్డి, రవి, కర్రె అశోక్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





























