మెదక్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 19: మెదక్ జిల్లా కేంద్రంలోని రామాలయం. వివిధ వార్డులలో సద్దుల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు.

సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలతో మమేకమై పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో రామాలయం పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News