రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ మృతి

పోలీస్‌ శాఖకు తీరని లోటు.. ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సంతాపం

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్‌ అక్టోబర్ 19: విధులకు హాజరయ్యేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ మృతి చెందడం తీవ్ర విషాదకరమని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ప్రసాద్‌ మృతి పోలీస్‌ శాఖకు తీరని లోటని పేర్కొంటూ ఆయనకు సంతాపం తెలిపారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి మెదక్‌కు వస్తుండగా నర్సాపూర్‌–మెదక్‌ మార్గంలో ప్రసాద్‌ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి స్కిడ్‌ కావడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.ప్రసాద్‌ మృతి పట్ల ఎస్పీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి పోలీస్‌ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Spread the love

Related News

Latest News