*నిరాధార ఆరోపణలు చేసినందుకు బైండోవర్ చేసిన పోలీసులు – చట్టపరమైన చర్యలు.
ప్రతిపక్షం మునుగోడు అక్టోబర్ 19: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , వారి అనుచరులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, అసభ్యకర పోస్టులు పెట్టినందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల ఓ పత్రికలో అప్పు పేరిట సేల్ డీడ్ అనే కథనం రాగా… ఆ కథనాన్ని కోట్ చేస్తూ మునుగోడు మండలం బీరెల్లి గూడెం గ్రామానికి చెందిన దోటి కరుణాకర్ అనే వ్యక్తి ఆ కథనాన్ని వక్రీకరించి ఎమ్మెల్యే అనుచరులే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేశారు.ఈ తప్పుడు ప్రచారంపై సంబంధిత గ్రామస్తులు సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శాంతి భద్రతల దృశ్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సదరు వ్యక్తిని బుధవారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట స్థానిక పోలీసులు బైండోవర్ చేశారు.
సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




























