చండూరు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్యకు ఘన నివాళి

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 19 : చండూరులో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పుల్లెంల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమతి అంజయ్యకు ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.శనివారం (అక్టోబర్ 17) జరిగిన ఈ ప్రమాదంలో అంజయ్య మృతి చెందడంతో మండల పరిషత్ కార్యాలయంలో విషాదం నెలకొంది.ఈ సందర్భంగా చండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో అధికారులు, సిబ్బంది అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News