భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు

దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

ప్రతిపక్షం, అక్టోబర్ 21, శేరిలింగంపల్లి: దసరా పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి లోని ఆరంభ్ టౌన్షిప్లో అసోసియేషన్ నిర్వహించిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులూ, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News