కల్వకుంటలో సందడి.. నాయకులు, కార్యకర్తల ఆత్మీయ పలకరింపులు
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 21: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నిజాంపేట మండలం కల్వకుంటలోని ఆయన నివాసానికి వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావడంతో సందడి నెలకొంది.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను తిరుపతిరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు ముచ్చటించారు. విజయదశమి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా ఐకమత్యం, సోదరభావంతో ముందుకు సాగాలని కోరారు. పండుగలు కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గంలోని శంకరంపేట పాపన్నపేట్ హవేలీ ఘన్పూర్ మెదక్ మండలం మెదక్ టౌన్ రామాయంపేట. నిజాంపేట మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. పాల్గొన్నారు.

































