ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ ల సేవలు వెలకట్టలేనివి.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్,జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్.
ప్రతిపక్షం, జగిత్యాల, ప్రతినిధి, అక్టోబర్, 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ,అశోక్ కుమార్ పోలీసు అమరవీరుల త్యా గాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడా రు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. బుధవారం పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పో యిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డేను జిల్లాలో ఘనంగా నిర్వహిం చారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ, అశోక్ కుమార్, పోలీస్ అధికారు లు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ,ప్రజలకు భద్ర త కల్పించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం, విపత్కర పరిస్థితుల్లో ప్రజ లకు అండగా నిలవడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, కుటుంబాలకు దూరంగా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే పోలీసు అధికారులు, సిబ్బం ది సేవలు అభినందనీయమ ని తెలిపారు. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయ మని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలీసు శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వ యంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించా లని, ప్రజా సమస్యల పరి ష్కారానికి ప్రాధాన్యత ఇవ్వా లని సూచించారు. అమరవీ రుల కుటుంబాలకుసమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ,అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశ రక్షణ, ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవ డం మనందరి బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో ధైర్యం, క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధతతో పనిచే యడం ప్రతి పోలీస్ అధి కారి, సిబ్బంది కర్తవ్యమని తెలిపారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించడం, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యతలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసు శాఖను సంప్రదించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సత్వర న్యాయం, సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
పోలీసు సిబ్బంది విధి నిర్వ హణలో అప్రమత్తంగా ఉంటూ, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని ఎస్పీ, సూచించారు. పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహక రించాలని, చట్టాలను గౌర విస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించా లని కోరారు. పోలీసు అమరవీరుల ఆశయాలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, వారి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్ర మము అనంతరం పోలీసు కుటుంబ సభ్యులకు బహు మతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు అమర వీర పోలీస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..































