28వ వార్డులో 200 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నూతన రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: కౌన్సిలర్ అఖిల భారత్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 22: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో కౌన్సిలర్ అఖిల భారత్ సుమారు,250 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల కోసం అర్హులైన ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ బియ్యం పొందడంతో పాటు, గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిర్ధవర్ లక్ష్మణ్ డీలర్ విజయ్ ఆధ్వర్యం లో పంపిణీ చేయడం జరిగినది

Spread the love

Related News

Latest News