బియ్యం, నిత్యవసర సరుకుల పై కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలి!

*తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 23: ఎల్‌నినో ప్రభావం వల్ల పంటల దిగుబడి పడిపోతుందనే సాకుతో కొందరు వ్యాపారులు బియ్యం తదితర నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన చండూరులో మాట్లాడుతూ.. దీనిని అరికట్టేందుకు రేషన్ షాపులు మరియు రైతు బజార్ల ద్వారా నిత్యావసరాలను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. బియ్యం ధరలు ఒక్కసారిగా క్వింటాలుకు రూ. 8000 నుంచి రూ‌. 10,000 పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోందని, నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందిస్తాయని భావించే కొన్ని రిటైల్ స్టోర్లలోనే బియ్యం ధరలు గణనీయంగా పెరిగినట్లు వినియోగదారులు చెపుతున్నారు అని అన్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉందో అని ఆవేదన చెందారు. బియ్యం ధరల పెరుగుదలకు ఎల్ నినో ప్రభావమే ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బియ్యం నిల్వలు, సరఫరా, మార్కెట్‌లో జరుగుతున్న ధరల మార్పులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఎల్ నినో కారణంగానే ధరలు పెరుగుతున్నాయా? లేక కొందరు వ్యాపారులు పరిస్థితిని ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ధరలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love

Related News

Latest News