*సింగారం గ్రామానికి చెందిన నేరటి పెద్దయ్యకు హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స .
*సిఎం సహాయనిధి కింద నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు – కుటుంబంలో హర్షం .
*మానవత్వం చాటుతూ పేదలకు అండగా నిత్యం ప్రజా సేవలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .
ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 23: మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన నేరటి యాదయ్య తండ్రి పెద్దయ్య అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన చికిత్స చేయించలేని పరిస్థితిలో ఉన్న వారి కుటుంబాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదుకున్నారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 4,00,000 (నాలుగు లక్షల రూపాయలు) ఎల్ఓసీ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఈ ఎల్ఓసీతో నిమ్స్ ఆసుపత్రిలో పెద్దయ్యకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఆయన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఆరోగ్య విషయంలో ఎవరూ ఆర్థిక ఇబ్బందులు పడవద్దని, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సహాయం అందిస్తానని ఆయన తెలిపారు.ఎమ్మెల్యే సహాయంతో ఎల్ఓసీ అందడంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.






























