శేరి సతీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేత

కాంగ్రెస్‌లో కొనసాగనున్న రాజకీయ ప్రస్థానం

కూకట్‌పల్లి, ప్రతిపక్షం, అక్టోబర్ 23: కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను కొనసాగిస్తానని కూకట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ చర్యల కమిటీ ఎత్తివేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన వివరణను పరిశీలించి సస్పెన్షన్‌ను ఎత్తివేసిన పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ అనంతుల, డీసీసీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.

తనకు అండగా నిలిచిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదవుల కంటే పార్టీ బలోపేతమే తన లక్ష్యమని, అధికారం కంటే కాంగ్రెస్ కార్యకర్తల అభిమానమే తన బలమని పేర్కొన్నారు.

పార్టీ క్రమశిక్షణను గౌరవిస్తూ స్థానిక నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ కమిటీతో సమన్వయంగా పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని శేరి సతీష్ రెడ్డి వెల్లడించారు.

Spread the love

Related News

Latest News